దళిత స్త్రీల వెతలు: Aruna Gogulamanda

దళిత వర్గాల స్త్రీలకు ఇంట్లోనూ అవమానాలే, అగ్ర కులాల నాజూకుతనాన్ని అబగా చూసే దళిత పురుషులు, తమ స్రీలను హీనంగా చూస్తారు.తప్పతాగొచ్చి అడిగింది వండిపెట్టలేదని భార్యని చితకబాదే మగమహారాజులు ఇక్కడ విరివిగా వుంటారు. మూదు పార్శ్వాల వివక్షలోనే ఆ స్త్రీల బ్రత్రుకులు కడతేరిపోతాయ్.నడిరోడ్లపై నగ్నంగా ఊరేగించినపుడో, పొలంలో కామందు లొంగదీసుకున్నపుడో, అవసరానికి వాడిపారేసినపుడో మాత్రమే వారు ఆడవాళ్ళన్న సంగతి గుర్తొస్తుంది తప్ప..మిగతాసమయమంతా వారిదో బండబారిన, రాటుదేలిన జీవన చిత్రం..
తమ స్త్రీల పట్ల స్పృహతో, మానవత్వంతో ఆలోచించాల్సిన అవసరం దళిత పురుషులకు లేదంటారా?

ప్రజాస్వామ్య దళితం !
_______________
మా కులమంతా ప్రజాస్వామ్యమేనంటూ మొదలౌతుంది..
మోసాలపర్వం..
కుంచమంత కూతురివంటూ
ఇంటెడు చాకిరీ చెయిస్తారు
బుడి బుడి అడుగుల ముచ్చటైనా తీరదు..
తమ్ముళ్లను సాకమంటారు..
ముక్కుపచ్చలైనా ఆరవు..
అంతులేని పనిపాట్లలోనే తెల్లారిపోతుంది బతుకు..
నీళ్లబిందెలు మోస్తూ ..ఇంటి పనులు చూస్తూ..
వంట చెరకు తెస్తూ..
కుల వ్యవస్థ మోపిన శాపాల శిలువను మోస్తూ..
"మాల మాదిగోళ్ళ పిల్ల అనగానే..
చెడ్దీల వెధవక్కూడా అమాంతం గుర్తొచ్చేమృగత్వాన్ని,
పసితనాన్నిసైతం కాటేసే కాముకత్వాన్ని నిస్సహాయంగా సహించి,
కీచక మూకల్ని దాటుకునో దాటలేకనో
ఇల్లు చేరి..
అమ్మ వెతల బ్రతుకు తాలూకు మిగులు బరువును
తెలియకుండానే తలకెత్తుకుని,
రొజంతా తప్పతాగి..
అచ్చోసిన అంబోతుల్లా
ఊరంతా బోరవిరుచుకు తిరిగే,
అదేమని అడిగితే
"మాకేంటే మగాళ్ళ"మంటూ
బూతుపురాణాలు విప్పే,
అన్నదమ్ములనబడే
పురుషపుంగవుల గుడ్డలుతకడానికీ...
పక్కలు పరవడానికీ..
తెచ్చింది కాస్తా వండి వడ్దించటానికే
జన్మనెత్తినట్టుగా సాగే..
'మా' 'ఏడకీ' చెందని 'ఆడబతుకు 'చిత్రం.
"దళిత ఆడబతుకు విచిత్రం.
చిన్నారి తల్లుల చిట్టిచేతులు కాయకష్టంతో బండబారితే,
పూటగడవని కటిక పేదరికంతో అమ్మ లాలిత్యం చితికి,
కామందు ఇంటికి పుట్టుకతొనేతాకట్టైపోతే,
పొగచూరిన వసారాల్లొ,
,పసిపిలల్ని సాకడలో,
నాట్లలో కోతల్లో..
అమ్మ మోసిన మోతల,
యెంతకీ ఆగని రంపపు కోతల,
అతుకుల బొంతలాంటి
గతుకురోడ్ల జీవనసమరంలో..
చితికి ఛిద్రమౌతున్న..
దళిత చెల్లెళ్ల వ్యధాభరిత బాల్యం.
నిర్లక్ష్యానికి రూపమిస్తే తయారయ్యే
మొగుళ్ల రాక్షసత్వం.
వద్దంటే పుట్టుకొస్తున్న బిడ్దల
పొట్ట కూటికి కూలికెళ్తే..
కామందు కామానికి పదే పదే బలైకూడా..
కిమ్మనకూడని జీవచ్చవం..
అలవికానన్ని అవమానాల సముద్రాలు
ఊహ తెలిసిన నాట్నుండీ ఈదుతూనే ఉన్నా,
యెక్కడిబాధనక్కడె పాతేసి..
చిరుగుల చెంగుతొ తుడిచేసి
యే విధంగానూ తన కధను,
ఇసుమంతైనా మార్చని రేపటికోసం..
పరిగేరితోనో కళ్ళమూడిస్తేనో రాలే,
నాలుగుడబ్బులతో పిలగాడి ఫీజు కట్టాలని
కుక్కిమంచంలోకూడా అలోచిస్తూ..
నిద్రరాని రాత్రులు గడిపే..
ఇదే..
మా ఆడపడుచుల రొజువారీ
జీవన గమనం.
'అన్నిరకాలాఅవసరాలూ
అడుగంటా తీర్చుకుని..
ఊరిపొలిమేరలవరకూ
తరిమి తరిమికొట్టింది..
అగ్ర కుల అహంకారమైతే.
..మరో అడుగు ముందుకేసి..
మూడు అడుగులతో పాతాళానికి తొక్కి.
ఇంట్లొనూ అంటరానిదాన్ని చేసింది..
మా వాడలోని పితృస్వామ్యం..
ఇది..
మా మగమేధావులు పాడుతున్న
ప్రజాస్వామ్య దళితం !

Comments

Popular posts from this blog

NARENDRA JADHAV’S OUTCASTE: A MEMOIR- A STORY OF THE METAMORPHOSIS OF DALITS

FIGURES OF SPEECH

Poisoned bread: protest in Dalit short stories.