దళిత స్త్రీల వెతలు: Aruna Gogulamanda
దళిత వర్గాల స్త్రీలకు ఇంట్లోనూ అవమానాలే, అగ్ర కులాల నాజూకుతనాన్ని అబగా చూసే దళిత పురుషులు, తమ స్రీలను హీనంగా చూస్తారు.తప్పతాగొచ్చి అడిగింది వండిపెట్టలేదని భార్యని చితకబాదే మగమహారాజులు ఇక్కడ విరివిగా వుంటారు. మూదు పార్శ్వాల వివక్షలోనే ఆ స్త్రీల బ్రత్రుకులు కడతేరిపోతాయ్.నడిరోడ్లపై నగ్నంగా ఊరేగించినపుడో, పొలంలో కామందు లొంగదీసుకున్నపుడో, అవసరానికి వాడిపారేసినపుడో మాత్రమే వారు ఆడవాళ్ళన్న సంగతి గుర్తొస్తుంది తప్ప..మిగతాసమయమంతా వారిదో బండబారిన, రాటుదేలిన జీవన చ ిత్రం.. తమ స్త్రీల పట్ల స్పృహతో, మానవత్వంతో ఆలోచించాల్సిన అవసరం దళిత పురుషులకు లేదంటారా? ప్రజాస్వామ్య దళితం ! _______________ మా కులమంతా ప్రజాస్వామ్యమేనంటూ మొదలౌతుంది.. మోసాలపర్వం.. కుంచమంత కూతురివంటూ ఇంటెడు చాకిరీ చెయిస్తారు బుడి బుడి అడుగుల ముచ్చటైనా తీరదు.. తమ్ముళ్లను సాకమంటారు.. ముక్కుపచ్చలైనా ఆరవు.. అంతులేని పనిపాట్లలోనే తెల్లారిపోతుంది బతుకు.. నీళ్లబిందెలు మోస్తూ ..ఇంటి పనులు చూస్తూ.. వంట చెరకు తెస్తూ.. కుల వ్యవస్థ మోపిన శాపాల శిలువను మోస్తూ.. "మాల మాదిగోళ్ళ పిల్ల అనగానే.. చెడ్దీల వెధవక్కూడా అమాంత...