బ్రతుకు బండిని మోసుకుంటూ .................
కూటికోసం కూలికోసం....
వూరు విడచి వాడ విడచి,
అమ్మనొదలి ఆలి నొదలి,
అక్కనోదలి చెల్లి నొదలి ,
ఆకలి కేకల ఆర్తనాదాలతో .........
కాలే కడుపు చేతబట్టుకొని,
సుదూర తిమిరాల్లో శ్రమిస్తూ ....
సగం కాలేకడుపుల్లో,
కారం మెతుకులు నింపుతూ ...
కూడు లేక గూడులేక,
నిలువ నీడలేక,
రెక్కాడితే గాని డొక్కాడని పరిస్తితుల్లో..............
వృద్ధ తల్లి దండ్రులను భార్య బిడ్డలను,
కరోనా కంటే..............
కరువు కోరల్లో.........
చావక ముందే చూడాలని ,
ఆశించి ఆశ్రయించి,
బస్సు లేక బండి లేక,
బ్రతుకు బండిని మోసుకుంటూ,
బయలు దేరిన వలస కార్మకా .......
గమ్యం చేరక ముందే.....
అలసి సొలసి,
మార్గ మధ్యలోనే ,
నేల తల్లిని నీ రక్తం తో ముద్దాడి,
మట్టి మనిషివై,
రైలు పట్టాలపై ప్రాణాలర్పించిన నీవు ....
అమరుడవే ......
తెగి పడిన బొటన వ్రేలు మొలచినట్లు .....
నిషేధించబడిన రాయి మూలకు తలరాయి అయినట్లు .....
ఆ చూపుడు వేలు మార్గంలో ప్రయాణిస్తూ ...
వస్తున్నాం .....
ఏదో ఒకరోజు జాషువా గారి రధ చక్రాలు మోసుకొస్తాం ...
ఆకలి కేకలు లేని
సమ సమాజాన్ని స్తాపిస్తాం .
( రైలు పట్టాలపై వలస కార్మికుల శవాలు చూశాక .... )
-మీ వేమన్న 09-05-2020
Comments
Post a Comment