MAA AMMA

అందరి  అమ్మలు  సంక్రాంతి  పండుగ  చేస్తుంటే...........
మా అమ్మ మాత్రం వరి  నాట్లు వేస్తుంటుంది.
అందరి అమ్మలు గొబ్బిమ్మలు కోసం ఉదయాన్నే ఊరంతా తిరుగుతుంటే...
మా అమ్మ మాత్రం ఉదయాన్నే పనికోసం వెతుకుతుంటుంది.
అందరి అమ్మలు కొత్త కోకలు కట్టి సాయంత్రం వురేగుతవుంటే.... 
మా అమ్మ మాత్రం చిరిగినా చీరతో కట్టెల మోపు మోస్తూ ఇంటికి వస్తుంటుంది.
అందరి అమ్మలు సంక్రాంతి సంబరాలు చేస్తుంటే ...
మా అమ్మ మాత్రం పిడికెడు ఆత్మ గౌరం కోసం రోడ్లు మీద ధర్నాలు చేస్తుంది.


Comments

Popular posts from this blog

DALIT POETRY IN INDIA – A HOICK WAVE IN INDIAN ENGLISH LITERATURE.

Ruskin Bond

FIGURES OF SPEECH