Posts

Showing posts from January, 2019

అమ్మ ........ (Mother)

పుట్టిన గడ్డమీద పండిన ప్రతి ధాన్యం గింజను  తన రక్తంతో తడిపి  తాను ఆకలి చావుకు గురయ్యేచోట .....  కాలి క్రింద భూమి  కదలిపోయే చోట .......  నిటారుగా నిలబడలేక  కుప్పకూలి పోయేచోట ....  అమ్మల్ని , అక్కల్ని  చెల్లెళ్ళని , కూతుళ్ళని  అత్యాచారం చేసేచోట .......  పిడికిలి బిగించి  కొడవలి పడుతుంది ........ . మా అమ్మ.  ఆడతనం , అంటరానితనాల మధ్య  రోకలి బండకింద చితికిన  దోస బద్దై రోదిస్తుంది  ......... మా అమ్మ.  పని నుండి పొద్దుపోయి రాగానే  కొంగు ముడి విప్పి  కొబ్బరి ముక్కలో , కందికాయలో  పెసరకాయలో, అలసందలో పెడుతూ ........  నువ్వు 'అంబెడ్కర్ ' అంత కావాలి '' నాన్నా... '' అంటూ  తన తల మీద నుండి ఈ పని భారాన్ని  తగ్గించమని కోరేది  ......... 'మా అమ్మ '.  పగలనక రేయనక పనిచేస్తూ ....  కష్టాల కన్నీళ్ల లో  తడిచి ముద్దయిన  ......... 'మా అమ్మ ' ను  చూస్తుంటే  ........  ''ప్రభు '' పాదాల చెంత  కన్...