ఓ మాతంగి..ఓ బసివి..
ఓ మాతంగి..ఓ బసివి.. _______________ ఆధిపత్య కులరాబందులు వేటాడే సరదాకై గుడిసెల్ని చెరపట్టి ఆడతనాన్నీ, అమ్మతనాన్నీ నడివీధిన నడిపించి కామ కళ్ళకావరం తో వికటంగా నవ్వినపుడేంచేసామని సమర్ధించుకొందాం? గోవునేమో మాతను చేసి, మనసారా పూజించి, గుడిసెలోని పసి బిడ్డకు మాతంగని ముద్రవేసి దేవుడిపేర దోచుకుంటే సైతం తప్పురా అని ముక్కోటిదేవతల్లో ఒక్కడైనా ముందుకొచ్చి ప్రశ్నించని అత్యాచారాల వేదభూమిలో ఆడబిడ్డకేం విలువుందని.. పారిస్ కై ప్రార్దిద్దాం.? సందుకో దేవాలయం గొందుకో దేవుడూ కొలువైన దేశంలో వెలివేతల్ని ప్రశ్నించని మూగదేవుళ్ళ రాజ్యంలో.. ఖైర్లాంజీ హత్యాచారాలు ప్రతినిత్యం చెలరేగుతున్నా స్థంభం చీల్చుకురాడేంటో యే నరసిమ్హావతారుడూ ? కులకాంతలకే చీరలిచ్చే నికృష్టులే దేవుళ్ళైన హెచ్చుతగ్గుల భారతంలో అట్టడుగువర్గపు మగువ మాంసం విచ్చలవిడిగా రెడ్లైట్ ఏరియాల పాలౌతుంటే మనం మాత్రం పారిస్ కై ప్రార్ధిద్దాం.. సామాన్యులు పూటకో తీరున రాళ్ళదెబ్బలకు కు బలౌతుంటే ఫుట్పాత్ లు రక్తమోడి, గొప్పోళ్ళకు తర్పణమౌతున్న నిచ్చెనమెట్ల సమాజంలో, మూల్నివాసుల్ని అనాధలు చేసే కుట్రల్లో బ్రాహ్మణవాదం తలమునకలౌతూ కుట్రలు రచిస్తున్న అత్యవసర సమయాల్లో.. ...